![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -371 లో.. కృష్ణ, మురారి ఇద్దరు కలిసి ముకుంద గురించి అలోచించి.. తమకు శోభనం వద్దని చెప్పినందుకు రేవతి వాళ్ళిద్దరిపై చాలా కోపంగా ఉంటుంది. ఏంటి పిన్ని అలా ఉన్నావని నందు వచ్చి రేవతిని అడిగినందుకు.. అందరి కోసం త్యాగాలు చేస్తూ నిర్ణయాలు తీసుకుంటుందని కృష్ణ గురించి చెప్తుంది రేవతి.
ఆ తర్వాత అంత కోపంగా ఉన్నారేంటని మధు వచ్చి రేవతిని అడిగినందుకు.. మధుకి కూడా చివాట్లు పడతాయి. మీరు కృష్ణని తప్పు గా అర్థం చేసుకుంటున్నారు. అవుటౌస్ నుండి ఇంట్లోకి రమ్మని చెప్పినప్పుడు.. వద్దు మురారి, నేను క్లోజుగా ఉంటే ముకుంద చూసి ఓర్వలేక ఏదైనా కుట్రలు చేస్తుందని చెప్పావ్ కదా ఇప్పుడు కూడా అంతే వాళ్ళు అన్యోన్యంగా ఉంటే చూడలేక ఏమైనా చేస్తుందేమోనని ఆలోచిస్తుందని మధు అంటాడు. అది విని.. అవును నువ్వు అన్నది కూడా నిజమే అని రేవతి అంటుంది. ఆ తర్వాత మురారి నిద్ర లేచి.. ఈ తింగరి తీసుకునే నిర్ణయలు ఎవరిని హ్యాపీగా ఉంచడం లేదని అనుకునే లోపే పక్కన టేబుల్ ఫై నన్ను తిట్టాలని అనిపిస్తుందా ఏబీసీడీల అబ్బాయి అని రాసి ఉంది చూసి మురారి నవ్వుకుంటాడు. అప్పుడే కృష్ణ వస్తుంది. భవాని అత్తయ్య పైకి అలా ఉంటున్న ఆదర్శ్ గురించి బాధపడుతుంది. పెద్దమ్మనే కాదు ఇంట్లో అందరికి ఆ బాధ ఉందని మురారి అంటాడు. ఇక ప్రతీక్షణం ఆదర్శ్ గురించి ఆలోచించాలని కృష్ణ అంటుంది. మీరు వెళ్ళి రెడీ అయి వస్తే ఆదర్శ్ గురించి తెలుసుకోవడానికి మెహత గారిని వెళ్దామని కృష్ణ చెప్తుంది. మరొకవైపు ముకుంద కాఫీ తీసుకొని వస్తే.. భవాని తీసుకోదు. అప్పుడే కృష్ణ, మురారి కిందకి వస్తారు. భవాని దగ్గరికి మురారి వెళ్లి.. ఎలాగైనా ఆదర్శ్ ని తీసుకొని వస్తానని చెప్తాడు. అయిన ఎలా వస్తాడని భవాని అనగానే.. జరిగిందంతా చెప్పి తీసుకొని వస్తామని కృష్ణ అంటుంది. జరిగింది ఏమైనా గొప్ప పనా? అయినా నీదే బాధ్యత అన్నావ్ కదా అంటూ భవాని వెళ్ళిపోతుంది. మొన్న దోషి ఎవరో తేలకపోతే మన పెళ్లి అవుతుందని.. తేలితే ఆదర్శ్ ని నీ భార్యగా అంగీకారిస్తానని అన్నావ్ గుర్తుకు ఉందా అని ముకుందని మురారి అడుగుతాడు. గుర్తుకుందని ముకుంద చెప్తుంది.
ఆ తర్వాత కృష్ణ, మురారి ఇద్దరు కలిసి మెహతకి కాల్ చేస్తే లిఫ్ట్ చెయ్యడు. మరొకవైపు కృష్ణ ఏంటి ఆదర్శ్ ని తీసుకొని వస్తానని అంత కాన్ఫిడెన్స్ గా చెప్తుంది. అయిన ఆదర్శ్ రాడని ముకుంద అనుకుంటుంది. అప్పుడే నందు మధు ఇద్దరు వచ్చి ఆదర్శ్ రావడం ఇష్టమేనా అని అడుగుతారు.. కృష్ణ కోసం అయిన నేను రావాలని అనుకుంటున్నాను. ఆదర్శ్ వచ్చి అన్ని మర్చిపోయి భార్యగా అంగీకరిస్తే చాలని ముకుంద అంటుంది. అయిన కానీ ముకుంద మాటలు మధుకి నమ్మాలని అనిపించదు. ఆ తర్వాత కృష్ణ మురారి ఇద్దరు కలిసి మెహత కాల్ కోసం వెయిట్ చేస్తుంటే.. అతనే ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి వస్తే అన్ని చెప్తానని అంటాడు. అలా అతను చెప్పగానే కృష్ణ మురారి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |